హెలికాప్టర్ లో యాత్రలు…చేపల కూరతో విందు..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. ఒక పక్క ఎస్ఎల్బీసీ టన్నెల్ లో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుని ప్రాణాలతో పోరాడుతుంటే మరో పక్క మంత్రులు హెలికాప్టర్ లో విహార యాత్రలకు వెళ్లినట్లు అక్కడకి వెళ్తారు.
అక్కడ ఉన్న కార్మికుల పరిస్థితులు ఎంటో ఎవరికి కనీసం క్లారిటీ ఉండదు. వాటర్ నీళ్లు కలవడం వల్ల ప్రమాదం జరిగిందని మంత్రి అంటారు. అదే మంత్రి అక్కడే ఉన్న గెస్ట్ హౌజ్ లో ఫిష్ కరీతో విందుభోజనాలు చేస్తారు.
మరోపక్క నాగర్ కర్నూల్ జిల్లా కొండవాగుల ఎస్టీ బాలుర హాస్టల్ లో పిల్లలకు కనీసం భోజనం పెట్టకుండా శివరాత్రి కాబట్టి దగ్గరలో ఉన్న శివాలయం దగ్గరకెళ్ళి తినండి అని హుకూం జారీ చేస్తారు. విద్యార్థులకు భోజనం పెట్టకుండా పస్తులు ఉంచుతారు. మంత్రులేమో విందుభోజనాలు చేస్తారు. ఇదేనా ప్రజాపాలన అని కేటీఆర్ ప్రశ్నించారు.
