సెక్రటేరియేట్ లో పెచ్చులూడాయనే వార్తలో నిజమేంతా..?

డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో పెచ్చులూడాయంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే..నిర్మాణ సమయంలో నాణ్యత లోపం వల్లే ఇలా జరిగిందంటూ అధికార కాంగ్రెస్ ఆరోపిస్తుంది.సెక్రటేరియట్‌లో 5వ మరియు 6వ అంతస్తుల్లో కేబుల్, లైటింగ్ పనులు కొనసాగుతున్నాయి.
ఇటీవలి మరమ్మతులలో భాగంగా.. లైటింగ్ కోసం, కొత్త కేబుల్స్ కోసం జీఆర్సీ (GRC) ఫ్రేమ్‌పై డ్రిల్లింగ్ చేపట్టారు. డ్రిల్ చేస్తే జీఆర్సీ డ్యామేజ్ అవుతుందని ఇది నిర్మాణ లోపం కాదు, అలాగే కాంక్రీట్ పనితో సంబంధం లేదు. సెక్రటేరియట్ భవన నిర్మాణానికి ఎలాంటి ముప్పు లేదని నిర్మాణ సంస్థలు చెబుతున్నాయి..
ఈ ఘటనపై శాపూర్ జీ పల్లోంజి నిర్మాణ సంస్థ స్పందించింది గత కొన్ని నెలలుగా సచివాలయం 5వ, 6వ అంతస్తుల్లో మరమ్మత్తులు, మార్పులు కొనసాగుతున్నాయి. ఐదో అంతస్తులో పనిచేస్తున్న సిబ్బంది డ్రిల్లింగ్ చేస్తున్న సమయంలో పెచ్చులు ఊడిపోయాయి.
రెగ్యులర్ డిపార్ట్‌మెంట్ పనులలో భాగంగా కేబుల్, లైటింగ్ కోసం మరమ్మతులు జరుగుతున్నాయి.
ఇది నిర్మాణ సమస్య కాదు. కాంక్రీట్ వర్క్‌కు సంబంధం లేదు, ఊడిపోయింది జీఆర్సీ ఫ్రేమ్ మాత్రమే. డ్రిల్ చేస్తే జీఆర్సీ డ్యామేజ్ అవుతుంది.స్ట్రక్చర్ నిర్మాణం పూర్తయి రెండేళ్లు అవుతుంది, ఎలాంటి నాణ్యత లోపం లేదని తెలిపారు.
