వైసీపీ లోకి టీడీపీ ఎమ్మెల్యే సోదరుడు..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీలోకి వలసల జోరు మొదలైంది. ఇప్పటికే పీసీసీ మాజీ అధ్యక్షులు.. మాజీ మంత్రి శైలజా నాథ్ ఇటీవల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెల్సిందే.
తాజాగా అధికార టీడీపీకి చెందిన సీనియర్ నాయకులు.. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన దివంగత మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు తనయుడు.. నగరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ సోదరుడైన గాలి జగదీష్ వైసీపీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెల పన్నెండో తారీఖున ఆయన వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ కండువ కప్పుకోనున్నట్లు ఆ వార్తల సారాంశం.
