టీడీపీవాళ్లకు వడ్డీతో సహా రిటర్న్ గిప్ట్ ఇస్తా- మాజీ మంత్రి రజినీ..?

ఏపీ అధికార టీడీపీకి చెందిన సీనియర్ నాయకులు.. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు వైసీపీకి చెందిన సీనియర్ మహిళ నాయకురాలు.. మాజీ మంత్రి విడదల రజినీ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే పుల్లారావు తనపై చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి రజినీ స్పందిస్తూ ” అధికారంలో ఉన్నాము. మాకు తిరుగే లేదనుకుంటూ అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టాలని చూస్తారా..?. అవినీతి అక్రమాలకు ఎలాంటి తావులేకుండా ఐదేండ్ల మా పాలనలో రాష్ట్రంలో ముఖ్యంగా నా నియోజకవర్గంలో అనేక సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేసి ప్రజల మన్నలను పొందాము..
మీకు చేతనైతే మీరు మాకంటే ఎక్కువ సంక్షేమాభివృద్ధిని ప్రజలకు అందించి మంచి పేరు తెచ్చుకోండి. అధికారాన్ని అడ్డుపెట్టుకోని .. వ్యవస్థలను వాడుకోని నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ మా నాయకులు.. కార్యకర్తలను ఎవరైన ఇబ్బందులకు గురిచేస్తాము.. అక్రమ కేసులు బనాయించి జైల్లో పెడతామని పగటి కలలు కంటే నాలుగేండ్ల తర్వాత మళ్లీ మేమే అధికారంలోకి వస్తాము.. మేము అధికారంలోకి వస్తే ఎవ్వరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు.
టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు వడ్డీతో సహా చెల్లిస్తానని మాజీ మంత్రి రజినీ మండిపడ్డారు. ‘నా ఏడేళ్ల రాజకీయ అనుభవం ముందు నీ పాతికేళ్ల రాజకీయ అనుభవం తల దించుకుంది. అక్రమ కేసులతో భయపెట్టాలని చూస్తే ఊరుకోం. కొంతమంది అధికారులు టీడీపీను చూసుకోని అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. మా పార్టీ నాయకులను .. కార్యకర్తలను వేధిస్తున్నారు. మేము అధికారంలోకి వచ్చాక అలాంటి అధికారులనూ సైతం వదలం. నేను ఇంకా 30 ఏళ్లు రాజకీయాలు చేస్తా. పుల్లారావు ఎక్కడ దాక్కున్నా లాక్కొచ్చి మరీ లెక్కలు తేలుస్తా’ అని ఆమె ఫైర్ అయ్యారు.
