నిద్రలో అలా చేస్తున్నారా..?
చలికాలంలో మిగతా కాలాలతో పోలిస్తే సహాజంగా అందరికీ మూత్రం ఎక్కువగా వస్తుంది. పగలు సంగతి ఎలా ఉన్న కానీ రాత్రిళ్లు మూత్రం వచ్చినా నిద్రకి భంగం అవుతుందని చాలా మంది బద్ధకిస్తారు.
ఇది ప్రమాదకరమని, బ్లాడర్ మీద ప్రెషర్ పెరిగి అది బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
మూత్రం ఎక్కువ సమయం ఆపితే పెల్విక్ ఫ్లోర్ కండరాలు బలహీనమవుతాయని, కాలక్రమేణా మూత్రాశయం పనిచేయకపోవచ్చని చెబుతున్నారు. మూత్రం రాగానే పాస్ చేయాలని సూచిస్తున్నారు.