కేసీఆర్ కు రేవంత్ సవాల్..!
![కేసీఆర్ కు రేవంత్ సవాల్..!](https://www.singidi.com/wp-content/uploads/2025/01/revanth-reddy-8-850x560.jpg)
ఎర్రవల్లి ఫామ్ హౌజ్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటరిచ్చారు. ఆయన మాట్లాడుతూ పద్నాలుగు నెలల పాటు ఫామ్ హౌజ్ లో పడుకున్నాడు. గంభీరంగా చూస్తున్నాడంట. ఏమి చూస్తున్నాడు కేటీఆర్.. హారీష్ రావులను ఊర్ల మీదకు వదిలాడు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పలగా మార్చారు.
గత ప్రభుత్వం చేసిన రుణమాఫీ కేవలం రైతులు తమకున్న వడ్డీలు కట్టడానికే సరిపోయింది. భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా రుణమాఫీ చేశాము. కేసీఆర్ కు దమ్ముంటే అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీలో లెక్కలు చెబుతాము.. అవసరమయితే రాష్ట్రంలో ఏ ఊరుకైన వెళ్దాం.. రుణమాఫీ ఎంత చేశామో తెలుసుకుందాము.
కేసీఆర్ నువ్వు కాలం చెల్లిన నోటువి. వెయ్యి రూపాయల నోటుకి విలువలేదు.పాలమూరును ఎండబెట్టిన దుర్మార్గుడివి నువ్వు. పదహారు వేల కోట్ల మిగులు రాష్ట్రంగా అప్పజెబితే ఏడు కోట్ల లక్షల రూపాయల అప్పుల రాష్ట్రంగా మార్చావు.. ఫామ్ హౌజ్ లో కూర్చోని సోది చెప్పడం కాదు. ప్రజల్లోకి రా.. దమ్ముంటే చర్చకు రా అని సవాల్ విసిరారు.
![](https://www.singidi.com/wp-content/uploads/2024/12/E-Paper-Coming-Soon.png)