మాదిగల ద్రోహి కాంగ్రెస్..!
మాదిగల ద్రోహి కాంగ్రెస్.ఎస్సీ రిజర్వేషన్ అమలులో కాంగ్రెస్ దొంగాట ఆడుతుందనిఖమ్మం తెలంగాణ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఫైర్ అయ్యారు.. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఖమ్మం జిల్లా లోని రెండు అసెంబ్లీ స్థానాలలో మాలలకే కేటాయించింది కాంగ్రెస్..అసెంబ్లీ స్పీకర్, కీలకమైన డిప్యూటీ సీఎం పదవులు సైతం మాలలకేనా ..? అని ప్రశ్నించారు..ఎస్సీ రిజర్వేషన్ను అమలు చేసి మాదిగ సామాజిక వర్గాలను సామాజిక న్యాయం చేయాలన్న భారత సుప్రీంకోర్టు తీర్పును నిర్లక్ష్యం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ.ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతలే పోటీ సభలు చేస్తున్నా పార్టీ పరంగా స్పందించడం లేదని సండ్ర మండిపడ్డారు.ఎస్సీ వర్గీకరణ పై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ అమలు చేయడం లేదని విమర్శించారు.
సుప్రీం కోర్టు తీర్పును అమలు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.కానీ ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం లేదన్నారు.వర్గీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతలే పోటీ సభలు చేస్తున్నా పార్టీ పరంగా స్పందించడం లేదని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ వైఖరి చూస్తుంటే వర్గీకరణకు వ్యతిరేకమని భావించాల్సి వస్తుందని సండ్ర ఆరోపించారు.కాంగ్రెస్ పార్టీ దళిత వ్యతిరేక పార్టీగా భావించాల్సి వస్తుందని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు పదవులు ఇవ్వడం లేదనీ, రాష్ట్రంలో కీలకమైన డిప్యూటీ సీఎం పదవితో పాటు అసెంబ్లీ స్పీకర్ ఖమ్మం జిల్లాలోని రెండు ఎమ్మెల్యే స్థానాలను సైతం మాదిగలకు ఒక్కటి కూడా ఇవ్వకుండా ద్రోహం చేశారని మండిపడ్డారు.కేసిఆర్ ప్రభుత్వంలో ఎస్సీ వర్గాల వారి ఉన్నతి కోసం దళిత బంధు, ఎస్సీ కార్పొరేషన్ నిధులు, 1025 గురుకులాలు, రెసిడెన్షియల్లు ఏర్పాటు చేయగా దళితులకు అత్యంత ప్రాధాన్యమిస్తూ దళిత బంధు ఏర్పాటు చేసి 10 లక్షల రూపాయలు ఇచ్చారు.
కాంగ్రెస్ పాలన రాగానే దళిత బంధు, ఎస్సీ కార్పొరేషన్, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ లను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది.125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి తాళాలు ధరించి ఉంచినది కాంగ్రెస్ ప్రభుత్వం.రాష్ట్ర సచివాలయానికే అంబేద్కర్ పేరును పెట్టి దళితుల పట్ల ఉన్న కెసిఆర్ చిత్తశుద్ధిని ఈ తెలంగాణ ప్రజలు గమనించాలి.కాంగ్రెస్ ప్రభుత్వం దళిత వ్యతిరేక చర్యలు మానుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ మాదిగ జాతికి అండగా వుంటుందని హెచ్చరించారు.ఎస్సీ వర్గీకరణ ను తక్షణమే అమలు చేసి ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో తమాషా పద్ధతిలో అమలు చేయాలని సండ్ర డిమాండ్ చేశారు.