రేవంత్ రెడ్డికి చంద్రబాబు కౌంటర్…!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కౌంటరిచ్చారు. ఏపీకి లేని హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే.
ఈ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ ” హైదరాబాద్ ను తెలుగు జాతికోసమే నేను క్రియేట్ చేశాను. కొందరి కోసం కాదు. ఎవరైన అలా అనుకుంటే నేనేమి చేయలేను.
ప్రతీ ఒక్కరు సమాజం గురించే ఆలోచిస్తారు అని అన్నారు. మరోవైపు ఇంకా బాబు మాట్లాడుతూ ఎంఓయూల కోసం దావోస్ వెళ్లాల్సినవసరం లేదు. మార్కెటింగ్ & నెట్ వర్కింగ్ కోసమే అక్కడ పర్యటిస్తారని ఆయన అన్నారు.