మాజీ సీఎం కేసీఆర్ కు ఝలక్…!
బీఆర్ఎస్ హాయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయి. అందుకే కాళేశ్వరం పిల్లర్లు కృంగిపోయాయని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ ను ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే.
ఈ కమీషన్ గత కొద్ది రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో సంబంధమున్న ప్రతి ఒక్కర్ని విచారణకు పిలిచి విచారిస్తుంది. ఈ విచారణలో ఇరిగేషన్ అధికారులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు తన్నీరు హారీష్ రావు, ఈటల రాజేందర్ పేర్లను చెప్పినట్లు తెలుస్తుంది.
అందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కాళేశ్వరం కమీషన్ విచారణ చేయనున్నది. ఈ వారంలోనే కేసీఆర్ ను విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు ఈటల, హారీష్ రావులను సైతం విచారించనున్నది.