బీజేపీ వైపు ఓ మంత్రి చూపు..! త్వరలోనే సీఎం మార్పు ఉంటుందా..?

 బీజేపీ వైపు ఓ మంత్రి చూపు..! త్వరలోనే సీఎం మార్పు ఉంటుందా..?

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయా..?.. కేంద్రంలో అధికారంలో ఉన్న ఉన్న బీజేపీ తెలంగాణలో తనదైన మార్క్ ను చూపెట్టబోతుందా..?.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో ఏక్ నాధ్ షిండే తయారయ్యారా..? .అంటే జరుగుతున్న తాజా పరిణామాలను చూస్తుంటే అవుననే అనిపిస్తుంది.బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్,కేటీఆర్,హరీశ్ రావు టార్గెట్ గా బీజేపీ దూకుడుగా వ్యవహరించింది.

బీఆర్ఎస్ కేసీఆర్ పై దుమ్మెత్తిపోస్తూ రెచ్చిపోయింది బీజేపీ పార్టీ..కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ దూకుడును ఎక్కడా బీజేపీ ప్రదర్శించలేకపోతుంది.దానికి కారణం కూడా లేకపోలేదు.దేశవ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థులు కానీ తెలంగాణలో మాత్రం చీకటి మిత్రులు అంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది..బీఆర్ఎస్ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి బీజేపీ చర్యలు.తెలంగాణలో ఫార్ములా ఈ విషయంలో కేటీఆర్ పై కేసు నమోదైన వారంరోజుల్లోనే ఈడీ విచారణ ప్రారంభించింది.అదే సవయంలో కర్ణాటక సీఎం విషయంలోనూ ఈడీ దూకుడు ప్రదర్శిస్తుంది..

కానీ తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన ఓ మంత్రి కి మాత్రం బీజేపీ రక్షణ కవచంగా పనిచేస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.సదరు మంత్రి కి మంచి పట్టు ఉండటం,ఆ మంత్రిపై ఇటివల ఈడీ దాడులు నిర్వహించినప్పటికి తదనంతరం ఆ మంత్రి ఓ పెద్ద హోటల్ లో బీజేపీ గాడ్ ఫాదర్స్ ను కలిసి సయోద్య కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది.తెలంగాణలో తాను నంబర్ 2 అని చెప్పుకునే ఆ మంత్రి,బీజేపీతో టచ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సయయం వస్తే తాను మద్దతు తెలుపుతామని ఒప్పందం కుదుర్చుకుని తనను సీఎం చేయవల్సిందిగా షరతు పెట్టినట్టు మీడియా వర్గాల్లో చర్చ జరుగుతుంది.ఈ చర్యలతో తెలంగాణలో బీజేపీ ఎలాగైనా అదికారం చేపట్టాలనే సంకల్పంతో ఉన్నట్టు తెలుస్తుంది.అందుకే ఆ మంత్రి విషయంలో ఈడీ మెతక వైఖరి అవలంభిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.ఇదే నిజమైతే తెలంగాణకు కొత్త సీఎం రావటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.ఇది తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే..!!

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *