తెలంగాణలో ఆలీ బాబా అరడజను దొంగలు..?
తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.అధికార,ప్రతిపక్షాల మధ్య మాటల దాడి తారా స్థాయికి చేరింది.నిన్న చేవెళ్లలో జరిగిన రైతు మహాధర్నాలో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వాఖ్యలు సంచలనంగా మారాయి..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ గా కేటీఆర్ పలు విమర్శలు చేస్తున్నారు.ఏసీబీ కేసులో కేటీఆర్ ను కావాలని రేవంత్ రెడ్డి ఇరికించారనే చర్చ ఉంది.అయితే అది ఉత్త కేసే అని దానిలో తనకు ఎలాంటి నష్టం జరగదని రేవంత్ రెడ్డి టార్గెట్ గా విమర్షలు చేస్తున్నారు కేటీఆర్..
అయితే నిన్న జరిగిన రైతు మీటింగ్ లో రేవంత్ రెడ్డి పై కేటీఆర్ సంచలన వాఖ్యలు చేసారు..అలిబాబా అరడజను దొంగలు గ్యాంగ్ తెలంగాణలో కంపెనీలను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు..
రేవంత్ రెడ్డి సోదరులు,అనుచరులైన ఎనుముల తిరుపతి రెడ్డి,కొండల్ రెడ్డి,వేం నరేందర్ రెడ్డి,రోహిన్ రెడ్డి,ఫహీం ఖురేషి,ఏవి రెడ్డిల పేర్లను ప్రస్థావిస్తూ వీరు రేవంత్ రెడ్డి పేరుతో భూదందాలు,కబ్జాలకు పాల్పుడుతున్నారని కేటీఆర్ సంచలన వాఖ్యలు చేసారు.వీళ్ళనే అలిబాబా అరడజను దొంగలుగా కేటీఆర్ అబివర్ణించారు.