రంగంలోకి కేసీఆర్..ఇక యుద్ధమే..!
తెలంగాణ స్వరాష్ట్ర సాధన పోరాటాన్ని సుదీర్గంగా నడిపి గమ్యాన్ని ముద్దాడారు కేసీఆర్..స్వరాష్జ్ర ఏర్పాటు తర్వాత రెండు మార్లు అధికారాన్ని చేపట్టి,సక్షేమం అభివృద్ధిని చేసి చూపించారు కేసీఆర్.ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తారనుకున్న కేసీఆర్ కు కాంగ్రెస్ అడ్డుకట్ట వేసింది.రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు టార్గెట్ గా పాలన సాగిస్తుంది.
బీఆర్ఎస్ తరపున గెలిచిన10 మంది ఎమ్మెల్యేలను సైతం తమవైపు లాక్కున్నారు.ఎంపీ ఎన్నికల సమయంలో భయటకొచ్చి బస్సుయాత్ర చేసిన కేసీఆర్,తర్వాత బడ్జెట్ సమావేశాల్లో ఒక్కరోజు అసెంబ్లీకి హాజరయ్యారు.నిత్యం కేసీఆర్ ను విమర్శించడం,బీఆర్ఎస్ అగ్రనేతలైన కేటీఆర్,హరీశ్ రావులను అరెస్ట్ చేయాలనే ఉద్ధేశ్యంతోనే అక్రమ కేసులు బనాయిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఈడీ ,ఏసీబీ కేసు ఇరికించడం,కార్యకర్తలను,నాయకులను నిర్భందాలకు గురిచేయటం,ప్రజలకు ఒక్కొక్కటిగా పథకాలను దూరం చేయటం,రైతు రుణమాఫీ కాక రైతులు రోడ్డెక్కడం,కేసీఆర్ డ్రీమ్ ప్రోగ్రామ్ రైతుభరోసా ఇవ్వకపోవడంతో కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తుంది.
గత ఏడాది కాలంగా స్తబ్దుగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు బయటకొచ్చి కాంగ్రెస్ పై యుద్దం ప్రకటించనున్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ కు ఏడాది పాటు సమయం ఇవ్వాలని కేసీఆర్ యోచించారని,సంవత్సరకాలాన్ని బీఆర్ఎస్ పై కక్షసాదింపులకి గురిచేయడానికి కాంగ్రేస్ ఉపయోగించిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది.
కాంగ్రెస్ చర్యలు శృతిమించాయని అందుకే స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగనున్నారని,రానున్న ఫిబ్రవరి నెలలో కేసీఆర్ గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇస్తారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నయి.ఇదే జరిగితే బీఆర్ఎస్ క్యాడర్ మరింత జోష్ గా పనిచేసే అవకాశం ఉంది.