హైకోర్టు లో కేటీఆర్ కు బిగ్ షాక్..!
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ పై దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు విచారించింది. ఈ విచారణలో ఇరువురి వాదనలు విన్న సుప్రీం కోర్టు మాజీ మంత్రి కేటీఆర్ కు షాకిచ్చింది.
ఈ రోజు బుధవారం ఉదయం మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఫార్ములా ఈ రేస్ కేసు విచారణ ప్రాథమిక దశలో ఉందని చెబుతూ హైకోర్టు ఆదేశాలలో జోక్యం చేసుకోబోమని వ్యాఖ్యానించింది.
అయినప్పటికీ మీకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి కదా? అంటూ మాజీ కేటీఆర్ తరఫున వాదిస్తున్న న్యాయవాదికి గుర్తుచేసింది. దీంతో క్వాష్ పిటిషన్ ను వెనక్కి తీసుకోవడానికి అనుమతించాలని న్యాయవాది కోరగా.. సుప్రీం ధర్మాసనం అంగీకరించింది. దీంతో కేటీఆర్ తన పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు.