భట్టీకి హారీష్ రావు సవాల్..!
మాజీ మంత్రి.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ శాసన సభ్యులు తన్నీరు హారీష్ రావు ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లుకు సవాల్ విసిరారు. సంగారెడ్డి ఎమ్మెల్యే కార్యాలయంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు గోబెల్స్ ను మించిపోతున్నారు.. అప్పుల విషయంలో అబద్ధాలు మాట్లాడారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పు కేవలం నాలుగు లక్షల 17వేల కోట్లు మాత్రమే.నిన్న నాగర్ కర్నూల్ లో భట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క ప్రాజెక్టు నిర్మాణం కాలేదు అని, ఒక ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని అన్నారు.
నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాలో 4000 కోట్లు ఖర్చుపెట్టి ఆరు లక్షల 50 వేల ఎకరాలకు నీళ్లు అందించాము.ఒక ఎకరానికి నీళ్లు ఇవ్వలేదు అని అంటే ఆరున్నర లక్షల ఎకరాలు నీళ్లు అందుతున్న రైతులు ఏమనుకోవాలి భట్టి గారు?.మీ హయాంలో పడావు బడ్డ భూములకు నీళ్లు ఇచ్చాము.తుమ్మిళ్ల లిఫ్ట్ పెట్టి 40,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చాము.చెక్ డ్యాములు, చెరువులు బాగు చేసి నెట్టెంపాడు,బీమా కోయిల్ సాగర్ ప్రాజెక్టులు పూర్తిచేసి ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాము.
మీ విశ్వసనీయత మీరే తగ్గించుకున్న వారు అవుతారు భట్టి గారు. ప్రజల్లో గౌరవం కోల్పోతారు.బహిరంగ చర్చకు సిద్ధం. ఎక్కడికి రమ్మంటారో చెప్పండి. మధిరకు రమ్మంటారా,సెక్రటేరియట్ కి రమ్మంటారా? మీ ప్రగతి భవన్ కి రమ్మంటారా? ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు, ఒక ఎకరాకు నీళ్లు ఇవ్వలేదన్నారు కదా లెక్కలతో సహా నేను వస్తా మీరు సిద్ధమా? అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లుకు బహిరంగ సవాల్ విసిరారు.