పర్మిషన్ సీఎం..!.మళ్లీ సరెండర్..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నేపద్యంలో కొత్త అంశం తెరపైకి వచ్చింది.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్పీఫెన్ సన్ ను 50 లక్షల కు ఓటును కొనుగోలు చేస్తూ బ్యాగుతో దొరికి ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఇరుక్కోవటం,దాని వెనక చంద్రబాబు నాయుడు ఉన్నాడు అని చర్చ జరగడం తెలిసిందే.
రెండు రాష్ట్రాలను షేక్ చేసిన సంఘటన అది..ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి A1 గా ఉన్నారు..అయితే ఈ కేసులో పదేళ్ళ క్రితం నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో తన పాసుపోర్ట్ ను జమ చేసారు రేవంత్ రెడ్డి.అప్పటి నుండి పాస్ పోర్ట్ అక్కడే ఉంది..
విదేశాలకు వెల్లిన ప్రతీసారి కోర్టు నుండి అనుమతి తీసుకుని పర్యటనలకు వెల్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..ఈ నెలలో ఆస్ట్రేలియా పర్యటన నేపద్యంలో పాస్ పోర్ట్ కోసం అభ్యర్థన చేయగా రూ.50 వేల పూచికత్తు తో పాసుపోర్ట్ ఏసీబీ కోర్టు జారీ చేసింది.మళ్ళీ పర్యటన ముగిసిన వెంటనే పాస్ పోర్ట్ ను సరెండర్ చేయాల్సింది ఉందని వార్తలు వింటున్నాము..ముఖ్యమంత్రి అయినా ఏసీబీ భాదలు తప్పట్లేదని అతని అభిమానులు వాపోతున్నట్టు సమాచారం..