టీమిండియా లక్ష్యం 239
భారత మహిళ జట్టుతో జరుగుతున్న తొలి వన్డేలో ఐర్లాండ్ ఓవర్లు మొత్తం ఆడి 238/7 పరుగులు చేసింది. గాబీ లూయిస్ (92) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడారు.
అయితే లూయిస్ ఎనిమిది పరుగుల తేడా శతకం చేజార్చుకున్నారు. లీ పాల్ (59) అర్ధ సెంచరీతో రాణించారు.
మరోవైపు భారత బౌలర్లలో ప్రియా మిశ్రా రెండు వికెట్లు తీశారు. టిటాస్ సాధు, సయాలి, దీప్తి శర్మ తలో వికెట్ పడగొట్టారు. భారత్ టార్గెట్ 239 పరుగులుగా ఉంది.