కేటీఆర్ కి వెళ్లింది ఏసీబీ నోటీసులా..?. లేఖనా..?.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ .. మాజీ మంత్రి కేటీఆర్ కు ఫార్ములా ఈ రేసు కారు కేసులో ఈ నెల తొమ్మిదో తారీఖున విచారణకు హాజరు కావాలని మరోకసారి నోటీసులు జారీ చేసిన సంగతి తెల్సిందే. ఈ నోటీసులపై సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీ నారాయణ స్పందిస్తూ మాజీ మంత్రి కేటీఆర్ కు వెళ్లిన నోటీసులను పరిశీలించాను. అవి ఏసీబీ నోటీసులెక్క లేదు లేఖ మాదిరిగా ఉన్నాయి. విచారణకు ఎందుకు పిలుస్తున్నారో అందులో స్పష్టంగా చెప్పలేదు అని అన్నారు.
ఆయన ఇంకా మాట్లాడూతూ నోటీసుల్లో ఏ సెక్షన్ కింద కేటీఆర్ ను విచారణకు పిలుస్తున్నారో పేర్కోనలేదు. ఆ నోటీసుల సారాంశాన్ని పరిశీలిస్తే ప్రశ్నించేందుకు, అవసరమైన పత్రాలను సమర్పించేందుకు ఏసీబీ ముందు విచారణకు హజరు కావాలని ఉన్నదని తెలిపారు. ఒకవేళ కేటీఆర్ నుండి ఏదైన పత్రం కావాలనుకుంటే ఆయనకు 94BNSS (91CRPC)కింద నోటీసులివ్వాలి. అలా జరగలేదు. కేటీఆర్ కు ఏసీబీ 160CRPC(ప్రస్తుతం 179BNS)కింద నోటీసులు ఇచ్చారు.
అయితే ఓ కేసు విషయంలో పరిజ్ఞానం ఉన్న వ్యక్తులను విచారణకు పిలవాలంటే 179BNS కింద నోటీసులు ఇవ్వాలని ఆయన అన్నారు. కానీ కేటీఆర్ ప్రస్తుతం ఎఫ్ఐఆర్ లో నిందితుడు మాత్రమే. ఎఫ్ఐఆర్ లో పేరు ఉన్న నిందితుడికి 160CRPC కింద నోటీసులివ్వోద్దని ఆయన పునరుద్ఘాటించారు.