మాజీ మంత్రి కేటీఆర్ పై ఈడీ విచారణలో ట్విస్ట్..!
ఫార్ములా ఈ రేసు కారు కేసులో ఈరోజు మంగళవారం మాజీ మంత్రి .. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉందన్న సంగతి మనకు తెల్సిందే.
ఇదే రోజు మంగళవారం హైకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ సైతం విచారణకు రానున్నది.
ఈ క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు క్వాష్ పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలో ఈడీ విచారణకు హాజరు కాలేను..
తనకు మరికొంత సమయం కావాలని ఈడీకి రాసిన లేఖను ఆమోదించింది. త్వరలోనే మరోక తేదిని ఖరారు చేస్తాము. అప్పుడు విచారణకు రావాల్సి ఉంటుందని కేటీఆర్ కు ఈడీ రిప్లయ్ ఇచ్చింది.