ఏడాదిలోనే అద్భుతాలు సాధ్యమా.?- కాంగ్రెస్ పాలనపై విశ్లేషణ..!

 ఏడాదిలోనే అద్భుతాలు సాధ్యమా.?- కాంగ్రెస్ పాలనపై విశ్లేషణ..!

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అరవై నాలుగు స్థానాలతో అధికారాన్ని దక్కించుకుంది కాంగ్రెస్ పార్టీ.. డిసెంబర్ ఏడో తారీఖున ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గత డిసెంబర్ తొమ్మిదో తారీఖుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కావోస్తుంది. మరి ఏడాదిగా కాంగ్రెస్ పాలన ఎలా ఉంది..? . ఏడాదిలో కాంగ్రెస్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎన్ని నెరవేర్చింది..?. ఏడాదిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతగా విజయవంతమయ్యారు..?. అనేది ఇప్పుడు చూద్దాము.

గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు మొత్తం నాలుగోందల ఇరవై ఎన్నికల హామీలనిచ్చింది. నాలుగోందల ఇరవై ఎన్నికల హామీలను పక్కన పెడితే ఆరు గ్యారంటీలను అమలు చేయమనే ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ తో పాటు బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిత్యం ప్రజాక్షేత్రంలో పోరాటాలను తమదైన శైలీలో నిర్వహిస్తుంది. మరి ఏడాదిగా ఆరు గ్యారంటీల్లో ఎన్నింటిని అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎన్ని హామీలను వందకు వందశాతం పేద ప్రజలకు చేరింది అని ఒక్కసారి ఆలోచిస్తే ఆరు గ్యారంటీల్లో ప్రధానమైంది ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కల్పించారు.

ఐదోందలకే సిలిండర్ అనేది అక్కడక్కడ అమలైనట్లు తెలుస్తుంది. మరో ప్రధాన హామీ ఆరోగ్య శ్రీ పది లక్షలకు పెంపు. ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అమలు అయిందని నాటి వైద్యారోగ్య శాఖ మంత్రి.. నేటి మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు రుజువులతో సైతం నిరూపించారు. ఇక పోతే తాము ఎంతో గొప్పగా అమలు చేశామని చెప్పుకుంటున్న రైతు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ దాదాపు 20,343 కోట్ల రూపాయలను మాఫీ చేసినట్లు కాంగ్రెస్ శ్రేణులు ప్రచారం చేసుకుంటున్నారు.ఇంకా రుణమాఫీ కాని వారు చాలా మంది రైతులున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

మహిళలకు రెండున్నర వేలు.. ఆసరా నాలుగు వేలు.. కళ్యాణలక్ష్మీ కింద తులం బంగారం ఇంతవరకూ ఊసే లేదు. నిన్న కాక మొన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ.. రైతుభరోసా కింద పన్నెండు వేలు .. కొత్త రేషన్ కార్డులు జారీ ఈ నెల ఇరవై తారీఖు నుండి ఇవ్వాలని నిర్ణయించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేయడం సాధ్యం కాకపోవచ్చు. కానీ ప్రజలకు ఏమి అవసరం..?. ఏ హామీలను ముందు అమలు చేయాలి.. రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంటది. దానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి ఏ హామీని ఎప్పుడు అమలు చేయాలన్నది అధికారంలో ఉన్న పార్టీ ఇష్టం.. ముఖ్యమంత్రి నిర్ణయం.

కానీ ఏడాదిలోనే అన్ని హామీలను అమలు చేయాలని ప్రజలు అధికారాన్ని కట్టబెట్టలేదు. ఐదేండ్లకు అధికారాన్ని కట్టబెట్టారు కాబట్టి ఇంకా నాలుగేండ్లు ఉన్నాయి. మరి ఈ నాలుగేండ్లలో ఈ హామీలన్నింటిని అమలుచేసి తెలంగాణ సమాజం మన్నలను పొందుతుందో.. లేదా బీఆర్ఎస్ చెబుతున్నట్లుగా ఫెయిల్ అవుతుంది.. తిరిగి తాము అధికారంలోకి వస్తామన్నది నిజమవుతుందో కాలమే సమాధానం చెప్పాలి. ఈ ఏడాది కాంగ్రెస్ పాలనలో అద్భుతాలు ఏమి జరగలేదు కానీ ప్రజల మన్నలను అయితే పొందలేదన్నది విశ్లేషకుల అభిప్రాయం.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *