కవిత బీసీ ఉద్యమం అంటే నవ్వోస్తుంది..!
Telangana : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు శుక్రవారం ఇందిరా పార్కులో గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్, నలబై రెండు శాతం రిజర్వేషన్లు అమలు కోసం బీసీల కోసం ఉద్యమం చేస్తున్న సంగతి తెల్సిందే.
ఈ విషయంపై అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మీడుయాతో మాట్లాడుతూ పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ కు బీసీలు గుర్తుకు రాలేదా..?. అధికారంలో ఉన్నప్పుడు బీసీలను గాలికొదిలేశారు.
కవిత బీసీల కోసం ఉద్యమం అంటే నవ్వోస్తుంది. మేము గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తాము.. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ తో పాటు 42% రిజర్వేషన్లు అమలు చేసి తీరుతాము.బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించే ఏకైక పార్టీ మాది అని ఆయన అన్నారు.