తల్లికి వందనం పై కీలక ప్రకటన..!
![తల్లికి వందనం పై కీలక ప్రకటన..!](https://www.singidi.com/wp-content/uploads/2024/09/chandrababu-2-850x560.jpg)
Babu Clarity On Deputy CM Of Lokesh
Ap: గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన తల్లికి వందనం కార్యక్రమంపై ఈరోజు జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.
వచ్చే విద్యా సంవత్సరం నుండే తల్లికి వందనం కార్యక్రమాన్ని ప్రారంభించాలని క్యాబినెట్ తీర్మానించింది. ఈ పథకం అమల్లో భాగంగా విధివిధానాలను త్వరలోనే ఖరారు చేయనున్నారు.
మరోవైపు ఈ పథకం కింద చదువుకునే ప్రతి విద్యార్థికి ఏడాదికి ప్రభుత్వం రూ.15,000లు అందించనున్నది. ఒక ఇంట్లో ఎంతమంది చదువుకునేవాళ్లు ఉంటే అంతమందికి ఈ పథకం వర్తిస్తుంది అని నాడు ఎన్నికల మ్యానిఫెస్ట్ లో ఎన్డీఏ కూటమి పెట్టింది.
![](https://www.singidi.com/wp-content/uploads/2024/12/E-Paper-Coming-Soon.png)