న్యూఇయర్ లో కేటీఆర్ కు కష్టాలు తప్పవా..?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీ రామారావుకు సంబంధించి ఫార్ములా ఈ రేస్ కారు కేసు గురించి హైకోర్టులో సుమారు నాలుగు గంటలకు పైగా వాదనలు కొనసాగాయి. ఉభయ పక్షాల వాదనలు విన్న జస్టిస్ కే లక్ష్మణ్ ధర్మాసనం తీర్పును రిజర్వు చేస్తున్నట్టు ప్రకటించింది.
తీర్పు వెలువడే వరకూ పిటిషనర్ కేటీఆర్‌ను అరెస్టు చేయరాదని, ఆయనపై ఏవిధమైన కఠిన చర్యలు చేపట్టరాదని పోలీసులను ఆదేశించిన సంగతి తెల్సిందే.ఈ విషయంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
మీడియాతో మంత్రి వెంకట రెడ్డి మాట్లాడూతూ ” న్యూఇయర్ రోజున మాజీమంత్రి కేటీఆర్ నున్ ఇబ్బంది పెట్టోద్దు. ఈ రెండు రోజులు ఆయన్ని ఎంజాయ్ చేయనిద్దామని వ్యాఖ్యానించారు. జనవరి మూడో నాలుగో తారీఖుల్లో ఆయన గురించి మాట్లాడుదామని అన్నారు. దీంతో కొత్త ఏడాదిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నుండి కేటీఆర్ కు ఇబ్బందులు తప్పావా అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.