2025లో గులాబీ దళపతి ఎవరై ఉంటారు..!
మాజీ మంత్రి… బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ కొత్త ఏడాదిలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్ర స్థాయి.. జిల్లా స్థాయి.. మండల స్థాయి.. గ్రామ స్థాయి అన్ని రకాల కమిటీలు వేస్తాము.. ఆ కమిటీల ద్వారా పార్టీని బలోపేతం చేస్తాము.. కాంగ్రెస్ ప్రభుత్వ వైపల్యాలపై క్షేత్రస్థాయి నుండి పోరాటం షూరు చేస్తాము అని ప్రకటించిన సంగతి తెల్సిందే.
ఇంతవరకూ బాగానే ఉంది మరి కొత్త ఏడాదిలో గులాబీ దళపతి ఎవరై ఉంటారు.. ప్రస్తుతం ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ అధినేతగా ఎన్నుకోనున్నారా..?. లేదా ప్రస్తుతం గత ఏడాదిగా ఇటు ప్రజలకు.. అటు ప్రభుత్వ వైపల్యాలపై పోరాటాలకు దూరంగా ఉన్న కేసీఆర్ ను కాదని ఏడాదిగా ఇటు ప్రజలకు.. క్యాడర్ కు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ వైపల్యాలపై కొట్లాడుతున్న మాజీ మంత్రి .. ప్రస్తుత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అధ్యక్షుడిగా ఎన్నుకుంటారా..?.
ఎందుకంటే దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ చరిత్ర చూసిన కానీ ఆ పార్టీ అధ్యక్ష పదవి తనకు కానీ తన వారసులకు కానీ అప్పజెప్తారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ సర్కారును.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీమ్ కేసీఆర్ స్థాయి కాదు.. వాళ్లకు మేమే చాలంటూ ఇటు కేటీఆర్.. అటు హారీష్ రావులతో పాటు బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రధాన విమర్శ. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో కేసీఆర్ బయటకు వచ్చేకంటే ఫామ్ హౌజ్ లో ఉండటమే ఉత్తమం.
పదేండ్లు సంక్షేమాభివృద్ధి జోడెద్దుల్లా పరుగులెత్తించిన బీఆర్ఎస్ ను కాదని అరవై ఏండ్ల అరిష్టాలకు కారణమైన కాంగ్రెస్ ను గెలిపించిన ప్రజలకు తన విలువ తెలియాలంటే కేసీఆర్ దూరంగానే ఉండాలి.. ఎన్నికలకు ముందు యుద్ధంలోకి దిగాలని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నారు. ఇవన్నీ పరిశీలిస్తే బీఆర్ఎస్ అధినేతగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ కు అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పి.. వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇటు హారీష్ రావు లేదా అటు కవితకు ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలంగాణ భవన్ వర్గాల టాక్. చూడాలి మరి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..?