జనసేన లో చేరికపై తమ్మినేని సీతారాం క్లారిటీ..?
వైసీపీ సీనియర్ నేత… వైసీపీ హయాంలో స్పీకర్ గా పని చేసిన తమ్మినేని సీతారాం కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న జనసేన పార్టీలో చేరతారు అని ఏపీ పాలిటిక్స్ లో చక్కర్లు కొట్టిన సంగతి తెల్సిందే..
జనసేనలో చేరతారనే వార్తలపై తమ్మినేని సీతారాం క్లారిటీ ఇచ్చారు.. ఆయన మీడియా తో మాట్లాడుతూ జనసేనలో చేరుతారన్న ప్రచారం సత్యదూరం..ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు.
ఇటీవలే నా కుమారుడిని ఆస్పత్రిలో చేర్పించాను. గత
15 రోజులుగా ఆస్పత్రి దగ్గరే ఉన్నాను.. ఈ కారణంతోనే గత నెల రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాను..
నాకు జనసేనలో చేరాల్సిన అవసరమేంటి అని ప్రశ్నించారు.