రేపు తెలంగాణ అసెంబ్లీ సమావేశం
రేపు సోమవారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశం జరగనున్నది. ఇటీవల మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అనారోగ్యానికి గురై మృతి చెందిన సంగతి తెల్సిందే.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఏడు రోజుల పాటు సంతాప దినాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది..
తాజాగా రేపు జరగనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపాన్ని తెలిపుతూ అసెంబ్లీలో సంతాప తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు..