హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్.. మాజీ మంత్రి హారీశ్ లకు ఊరట…?
తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానమైన హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్… మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావులకు ఊరట లభించింది. అధికారంలో ఉన్న సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్.. మాజీ మంత్రి హారీష్ లకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు జారీ చేసిన నోటీసులను హైకోర్టు కొట్టివేసింది.
ఈ సందర్భంగా మేడిగడ్డ వ్యవహారంలో జిల్లా కోర్టు తన అధికార పరిధిని దాటి మరి ప్రవర్తించిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. మేడిగడ్డ కుంగుబాటు గురించి కేసీఆర్ హాయాంలోని అవినీతే కారణం అని నాగవెల్లి రాజలింగమూర్తి అనే వ్యక్తి భూపాలపల్లి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీంతో కోర్టు ఈ అభ్యంతరాలను పరిశీలించి మాజీ సీఎం కేసీఆర్.. మాజీ మంత్రి హారీష్ రావు, అప్పటి నీటిపారుదల శాఖ కార్యదర్శి రజత్ కుమార్, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇంజనీరింగ్ అధికారులు ,మేఘా ,ఎల్& టీ సంస్థ ప్రతినిధులు హాజరు కావాలని నోటీసులు జారీచేసింది. ఈ నేపథ్యంలో ఈ నోటీసులపై హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా దీనిపై జస్టీస్ కే లక్ష్మణ్ ధర్మాసనం విచారించి ఆనోటీసులను సస్పెండ్ చేసింది.