సినీ ఇండస్ట్రీ పై కాంగ్రెస్ బిగ్ స్కెచ్..!
తెలంగాణ లో కాంగ్రేస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుండి సినీ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.ఇండస్ట్రీలో రాజకీయాలతో కూడిన వరుస వివాదాలు సంచలనంగా మారుతున్నాయి.నాగర్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో మొదలైన వివాదాలు తాజాగా అల్లు అర్జున్ సంద్య థియేటర్ ఇష్యూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చర్చ చేసే వరకు వెల్లింది.ముందుగా హైడ్రా కూల్చివేతల్లో బాగంగా నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చివేసింది..అనంతం మంత్రి కొండా సురేఖ సినీనటి సమంత,నాగార్జున కుటుంబంపై సంచలన ఆరోపణలు చేసారు..
అది కొన్ని రోజుల పాటు హాట్ టాపిక్ గా మారింది.అనంతరం సంద్య థియేటర్ లో పుష్ప -2 ప్రీమియర్ షో కోసం అల్లు అర్జున్ వెల్లగా తొక్కీసలాటలో ఒక మహిళ చనిపోవటం,బాబు గాయాలపాలవటం జరిగింది.మూడు రోజులు సైలెంట్ గా ఉన్న ఈ ఇష్యూ ముగిసింది అనే సమయానికి అల్లు అర్జున్ అరెస్ట్,సినీ ఇండస్ట్రీ టార్గెట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాఖ్యలు,అసెంబ్లీలో చర్చ హాట్ టాపిక్ గా మారాయి..
అయితే ఇదంతా కాంగ్రేస్ ప్రభుత్వం,రేవంత్ రెడ్డి కావాలని చర్చ పెడుతున్నారని కొందరు ఆరోపిస్తున్నారు.కాంగ్రేస్ ప్రభుత్వం రాష్ట్రంలో కొన్ని అనాలోచిత నిర్ణయాలు హైడ్రా,లగచర్ల రైతుల అరెస్ట్,రైతు బంధు ఎగవేత,అసంపూర్ణ రుణమాఫీ ఇలా అనేక అంశాలు పక్కదారి పట్టించేందుకు సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులతో వివాదాలు తెరలేపి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..కాంగ్రేస్ పార్టీ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా ఉన్న సునీల్ కనుగోలు టీమ్ ఈ పీఆర్ స్టంట్స్ వేస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.కొన్నాళ్ళుగా సినీ ఇండస్ట్రీ టార్గెట్ గా సాగుతున్న ఈ వివాదాలకు ఎప్పుడు పుల్ స్టాప్ పడుతుందో వేచి చూడాలి.