“ఈజ్ ఇట్ ది వే” అంటూ కాంగ్రెస్ ను చీల్చి చెండాడిన హారీష్ రావు..!
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ శాసన సభ్యులు తన్నీరు హారీష్ రావు ఒకవైపు కంటెంటుతో.. మరోవైపు కౌంటర్లతో అధికార కాంగ్రెస్ పార్టీని ఎన్కౌంటర్ చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఏ అంశాన్ని లేవనెత్తిన కానీ దానికి సమాధానం ఇస్తూనే మరోవైపు కాంగ్రెస్ పార్టీ గత చరిత్రను బట్టలు విప్పి మరి నిలబెట్టినట్లు ఎన్కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా గురువారం అసెంబ్లీ సమావేశాల్లో ఎంఐఎం సభ్యుడు అక్బరుద్ధీన్ ఓవైసీ మాట్లాడుతూ ” మీకు సభను నడిపించడం చేతకాదు.
ప్రభుత్వాన్ని నడిపించడం చేతకాదు. సభలో జరిగే చర్చ గురించి సభ్యులకు అందజేసిన తర్వాతనే దానిపై చర్చ పెడతారు.. కానీ సభలో జరిగే అంశాల గురించి సభ్యులకు చెప్పకుండా ఉన్నఫలంగా చర్చ పెడతారు.దానిపై సలహాలు సూచనలు ఎలా ఇస్తారు. ముందుగానే చెప్తే సభ్యులు దానిపై పరిశీలన చేసి అవసరమైన సలహాలు.. సూచనలు చేస్తారని అన్నారు. అనంతరం మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” ఎంఐఎం సభ్యులు అక్బరుద్ధీన్ ఓవైసీ మాట్లాడిన మాటలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను.
సభలో బిజినెస్ అవర్స్ గురించి ముందుగానే సభ్యులకు చెప్పడం సభ సంప్రదాయం. మీరు చైర్ లోకి రాకముందే నేను అసెంబ్లీ సెక్రటరీ గారి దగ్గరకెళ్లి ఇవాళ బిజినెస్ అవర్స్ గురించి అడిగాను. నాకు తెలియదు సారు. స్పీకర్ సారు చెప్తారు అని సమాధానం ఇచ్చారు. ఇదేక్కడి సంప్రదాయం స్పీకర్ సార్. సభ ప్రారంభానికి ముందు సభ్యులకు సబ్జెక్ట్ గురించి చెప్తారు. ఈజ్ ఇట్ ది వే.. ఈజ్ ఇట్ ది వే అంటూ సభ జరుగుతున్న తీరుపై విరుచుకుపడుతూ అధికార పార్టీని చీల్చి చెండాడారు.