అసెంబ్లీలో మాజీ మంత్రి హారీష్ రావు సంచలన వ్యాఖ్యలు..?
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అసక్తికర వ్యాఖ్యలు చేశారు. సభ ప్రారంభమైన కొద్ది సేపటికే గందరగోళ పరిస్థితి నెలకొంది. రోడ్ల నిర్మానంపై హారీశ్ రావు , మంత్రి కోమటిరెడ్డి మధ్య వార్ మొదలైంది. దీంతో హరీష్ రావు వ్యాఖ్యలపై స్పందిస్తూ.. మామ చాటు అల్లుడిగా హరీష్ రావు 10 వేల కోట్లు సంపాదించుకున్నాడు.. కాళేశ్వర్యంలో కమిషన్లు తీసుకున్నట్లు తాను నిరూపిస్తానని మంత్రి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాగా ఆరోపణలపై మాజీ మంత్రి హరీష్ రావు ఘాటుగా స్పందించారు. తాను కమిషన్లు తీసుకున్నట్లు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు కౌంటరిచ్చారు. ఆయన మాట్లాడుతుండంగా అధికార పార్టీకి చెందిన సభ్యులు రన్నింగ్ కామెంట్రీ చేస్తూ పలుమార్లు ఆయన ప్రసంగానికి అడ్డు తగిలారు.
దీంతో మాజీ మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ ” బయట డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టినట్లు అసెంబ్లీ ముందట కూడా పెట్టాలి.. ఉదయం కొంతమంది సభ్యులు తాగి వచ్చారనుకుంటా.. తమ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు.