టీడీపీ లోకి మాజీ డిప్యూటీ సీఎం..?
ఏపీ మాజీ మంత్రి, వైసీపీ పార్టీ సీనియర్ నేత ఆళ్ల నాని అధికార తెలుగుదేశం పార్టీలోకి రావడానికి లైన్ క్లియర్ అయ్యింది. తెలుగు తమ్ముళ్లు బహిరంగంగా ఎంత వ్యతిరేకించిన చివరికి అధిష్టానం నిర్ణయానికి తలవంచక తప్పలేదు..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొంత కాలానికే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన ఆయన.. టీడీపీలో చేరేందుకు సిద్ధం అయ్యారు.. అయితే, స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకించడంతో.. అప్పుడు తాత్కాలికంగా వాయిదా పడినా.. ఇప్పుడు టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.. దీంతో ఈరోజు ఉదయం 11 గంటలకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పసుపు కండువా కప్పుకోనున్నారు ఆళ్ల నాని.
కొంత మంది కార్యకర్తలు ఆళ్ల నాని చేరికపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. ఏదేమైన టీడీపీ క్రమశిక్షణకు మారుపేరని.. ఆళ్ల నాని చేరిక విషయంలో అధిష్టాన నిర్ణయం శిరోధార్యమని స్పష్టం చేశారు ఎమ్మెల్యే బడేటి.