కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన హారీష్ రావు
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. సభలో అధికార ప్రతిపక్ష పార్టీకి చెందిన సభ్యులు ఒకరిపై ఒకరు విమర్షనాస్త్రాలను సంధించుకున్నారు. మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క మల్లు సభను తప్పు దోవ పట్టిస్తున్నారు.
పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులతో మిషన్ భగీరథతో తాగునీళ్ళు ఇచ్చాము. మిషన్ కాకతీయతో చెరువులను బాగు చేశాము. కాళేశ్వరం ,మల్లన్నసాగర్ లాంటి ప్రాజెక్టులను కట్టాము. భక్తరామదాసు ప్రాజెక్టుతో భట్టీ గారి సొంత జిల్లా ఖమ్మంలో లక్షల ఎకరాలకు సాగునీళ్ళు అందించాము. పేదింటి ఆడబిడ్డల పెండ్లికి కళ్యాణ లక్ష్మీ ఇచ్చాము.
పల్లెప్రగతితో పల్లెలను గ్రామాలను , పట్టణ ప్రగతితో పట్టణాలను బాగుచేశాము. పల్లె దవాఖానాలు.. పట్టణ దవాఖానాలు కట్టాము.. మీరు ఏడాదిలో చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1.27 వేల కోట్లు అప్పు చేసి ఏదైనా ప్రాజెక్టు కట్టి సంపద సృష్టించారా?.కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కమిషన్ల కోసం పంచుకొని తినడానికి అప్పు చేశారు అని ఫైర్ అయ్యారు.