అల్లు అర్జున్ ఖైదీ నంబర్ ఇదే…?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానమైన హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన కానీ బెయిల్ పేపర్లు సరిగా లేవని చంచల్ గూడ జైలు అధికారులు నిన్న శుక్రవారం అంతా వృధా చేశారని అల్లు కుటుంబ సభ్యులు,వారి తరపున న్యాయవాది, అల్లు అభిమానులు గుర్రుగా ఉన్న సంగతి తెల్సిందే.
బెయిల్ పేపర్లు ఆలస్యంగా తమకు చేరడంతో ఈరోజు శనివారం ఉదయం అల్లు అర్జున్ ను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో బన్నీకి జైలు అధికారులు మంజీరా బ్యారక్ లో అండర్ ట్రైల్ ఖైదీగా నంబరు 7697 తో ఉంచారు.
నిన్న రాత్రి పదిగంటల వరకు రిసప్షన్ లో ఉంచిన పోలీసులు తర్వాత రూమ్ ను సిద్ధం చేసి అక్కడకి తరలించారు.ఈ రూమ్ లో బన్నీతో పాటు మరో ఇద్దరూ ఖైదీలున్నట్లు సమాచారం.