రాత్రి పూట ఆలస్యంగా నిద్ర పోతున్నారా..?
ప్రతి రోజూ రాత్రి సమయంలో చాలా ఆలస్యంగా పడుకొని ఉదయాన్నే నిద్ర లేచేందుకు ఇబ్బందులు పడేవారిలో గుండె జబ్బుల ప్రమాదం పొంచి ఉందని ఓ సర్వేలో తేలింది.
ప్రతిరోజూ క్రమం తప్పకుండా రాత్రి పూట త్వరగా పడుకొని తెల్లవారుజామున లేచే వారితో పోలిస్తే అర్ధరాత్రి ఆలస్యంగా నిద్రించే వారికి డయాబెటిస్ రిస్క్ ఎక్కువని పేర్కొంది.
మరోవైపు అర్ధరాత్రి వరకు మేల్కొనే వాళ్లు వీకెండ్ నిద్రతో ఆ లోటును భర్తీ చేయాలనుకోవడం ఆరోగ్య సమస్యలకు కారణమని కూడా ఆ అధ్యయనాల్లో తేలింది.