నాడు దొంగ మాటలు.. నేడు కారుకూతలు

 నాడు దొంగ మాటలు.. నేడు కారుకూతలు

Loading

అప్పులపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ.. తెలంగాణ భవన్‌లో  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ అంటే కేసీఆర్ అంటూ అదే శ్రీరామరక్ష అని దేశవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి పనిచేస్తున్న సామాజిక మాధ్యమ వీరులకు ధన్యవాదాలు. గత ఎడాదికారంగా ప్రభుత్వం అరాచకాలపైన అక్రమాలపైన స్కాంలపైన ప్రజల తరఫున పోరాడిన పార్టీ లీడర్లకి, పార్టీ శ్రేణులు అందరికీ అభినందనలు తెలిపారు.

ముఖ్యమంత్రి తన తప్పులను తప్పిపుచ్చుకోవడానికి మరోసారి అప్పులనే తప్పుడు కూతలు కూస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో జరగాల్సింది అప్పుల మీద కాదు చర్చ.. రేవంత్ చేసిన తప్పులపైన చర్చ జరగాలి. ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన తర్వాత సీఎం పదవికున్న పరువు తగ్గింది.11 నెలలు పాలనలో అనుముల సోదరులకు మాత్రమే లాభం జరిగింది.11 నెలలలోనే రాష్ట్రానికి రూ. 1000 కోట్లు ఖర్చు పెట్టే స్థాయికి అనుముల సోదరులు ఎదిగారు.ఇదే పరిస్థితి ఉంటే వచ్చే సంవత్సరం ఫోర్బ్స్ జాబితాలో రేవంత్ రెడ్డి సోదరులు చేరుతారు.

దివాళా తీసింది రాష్ట్రం కాదు దివాళాకోరు ముఖ్యమంత్రి రావడం రాష్ట్రానికి దారుణం.కొత్త పరిశ్రమల మాట దేవుడెరుగు ఉన్న పరిశ్రమల తరలిపోతున్నాయి. తెలంగాణ రైజింగ్ అని కొత్త నాటకానికి తెర లేపారు.అదీ తెలంగాణ రైజింగ్ కాదు అనుముల బ్రదర్స్ రైజింగ్.. తెలంగాణ ఫాలింగ్, తెలంగాణ ఫెయిలింగ్.అబద్ధాలు, అసత్యాలు, అటెన్షన్ డైవర్షన్ టెక్నికులు మాత్రమే.. మీడియా మేననెజ్‌మెంట్ తప్ప 11 నెలల్లో సీఎం చేసింది ఏమిటో చెప్పాలి. నువ్వు చేసిన తప్పులను దాచుకునే ప్రయత్నం చేస్తే ఊరుకోం, వదిలిపెట్టం.గతంలో ఇండియా షైనింగ్ అన్న వాళ్ళు గతి లేకుంటే నువ్వు కూడా కొట్టుకుపోతావు. కారుకూతలతో, కుప్పిగంతులతో రేవంత్ టైంపాస్ చేశారు.నీ శ్వేతపత్రానికి బీఆర్ఎస్ స్వేదపత్రంతో సమాధానమిచ్చింది.

అప్పులపై చెప్పిన అబద్ధాలకు సమాధానాలు చెప్పాం.
ఇచ్చిన హామీలు అమలుకు చేయకుండా తప్పించుకునేందుకు అప్పులపై డ్రామాలు.అప్పుల మీద కాకుండా ఇచ్చిన హామీల అమలుపైన మాట్లాడాలి. కాంగ్రెస్ ఇచ్చిన వాగ్ధానాలపైన మాట్లాడాలి.ఎన్నికల ముందు తెలంగాణ ఆర్ధిక పరిస్థితి తెలుసని టీవీల ముందు చెప్పావు.నాడు దొంగ మాటలు.. నేడు కారుకూతలు కూస్తున్నాడు. ఈ ఏడాదిలో ఏం పాలన చేశారో చెప్పండి.కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లను తమవి అనే దివాళాకోరు తనం రేవంత్‌దీ.రేవంత్ ప్రభుత్వం ఇచ్చింది కేవలం 12 వేల ఉద్యోగాలు మాత్రమే
. రేవంత్ బండారం బయటపెట్టేలా రాహుల్ గాంధీకి లేఖ రాస్తా.అశోక్‌నగర్‌ వచ్చి నిరుద్యోగులను నమ్మబలికి మోసం చేశారు.రాహుల్ గాంధీకి తెలిసి దొంగ నాటకాలు ఆడితే ప్రజల ముందు నిలబెడతాం.రేవంత్ రెడ్డి ఎన్ని తప్పుడు కూతలు కూసిన వదిలిపెట్టను. ఇచ్చిన ఉద్యోగాలు, రుణమాఫీ, ఆరు గ్యారెంటీల మొదలు అన్ని అబద్ధాలే.రాష్ట్రంలో పాక్షికంగానే అమలు అయింది రుణమాఫీ. భట్టి విక్రమార్క ప్రకారం కేవలం రూ. 11,000 కోట్ల డబ్బులు కూడా రైతులకు అందలేదు అని అన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *