కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. పెద్దపల్లి లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉండి రూ.1.02 లక్షల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని విమర్శించారు.
వందేళ్ల చరిత్ర ఉన్న మా పార్టీ పాలనలో ‘మేం కట్టిన శ్రీశైలం, నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులు 60 ఏళ్లు ఎలా ఉన్నాయో, నువ్వు కట్టిన కాళేశ్వరం ఎలా ఉందో చూడ్డానికి రా. లెక్కలు తేలుద్దాం’ అని కేసీఆర్ కి ఆయన సవాల్ విసిరారు.
ఈ ఏడాది కాళేశ్వరం నుంచి చుక్కనీళ్లు లేకపోయినా రికార్డు స్థాయిలో కోటి మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.