హైకోర్టులో ఆర్జీవీకి ఊరట..!
ప్రముఖ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టులో ఊరట లభించింది. గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రివర్యులు నారా లోకేష్ నాయుడు గురించి ఆర్జీవీ తన ట్విట్టర్ వేదికగా అవమానిస్తూ మార్ఫింగ్ పోస్టులు పెట్టిన సంగతి తెల్సిందే.
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు పోలీస్ స్టేషన్లలో ఆర్జీవీపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. పోలీసులు హైదరాబాద్ లోని రామ్ గోపాల్ వర్మ డెన్ కి వచ్చి పలుమార్లు నోటీసులు సైతం అందజేశారు.
దీంతో దర్శకుడు ఆర్జీవీ హైకోర్టులో ముందస్తు బెయిల్ గురించి వేసిన పిటిషన్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆయనను వచ్చే సోమవారం వరకు అరెస్ట్ చేయద్దు అని ఆదేశించింది.