టీడీపీ కార్యకర్త ఆత్మహత్య – రాజకీయ పార్టీలకు ఓ గుణపాఠం..!
ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన శ్రీను అనే కార్యకర్త తనకున్న ఆర్థిక,కుటుంబ సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడటం రాష్ట్ర రాజకీయాల్లో ఓ సంచలనం సృష్టిస్తుంది. రాజకీయ పార్టీకి అది అధికార పార్టీకి చెందిన కార్యకర్త అది కూడా ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడటం యావత్ రాజకీయ పార్టీలు ఓ గుణపాఠాన్ని నేర్చుకోవాలి. చనిపోయిన శ్రీను అనే కార్యకర్త సామాన్య కార్యకర్తనే కాదు. ఏకంగా తనతో పాటు తన చుట్టూ ఉన్న వారి సమస్యలను నేరుగా మంత్రి లోకేష్ కు చెప్పే అంత చనువు ఉంది.
అనుబంధం ఉంది. అలాంటి కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడటం నిజంగా బాధాకరం. ఇదే అంశంపై మంత్రి లోకేష్ కూడా స్పందించారు. తాను ఆ కుటుంబానికి ఓ అన్నగా అండగా ఉంటానని భరోసానిచ్చారు. ఓ వ్యక్తి చనిపోయాక ఆ కుటుంబానికి అండగా ఉండటం కంటే ఆ కార్యకర్త సాధకబాధలను తెల్సుకుని అండగా ఉండటం ఉత్తమం అని అంటున్నారు రాజకీయ వర్గాలు. పార్టీకి చెందిన కార్యకర్తలందరికి అండగా ఉండటం సాధ్యం కాకపోవచ్చు.
కానీ కష్టాల్లో ఉన్న కార్యకర్తలను అది అధికార పార్టీ ఆదుకోవడంలో విఫలమవ్వడం నిజంగా బాధాకరం. ఏపీలో కూటమి అధికారంలో ఉన్న ఆ పార్టీకి చెందిన నేతలు.. కార్యకర్తలు ఆవేదనలో.. బాధలో ఉన్నారని జగమెరిగిన సత్యం. ఇప్పటికైన ఆ కూటమి పార్టీలు నిజంగా పార్టీకోసం కష్టపడే కార్యకర్తలను నేతలను ఆదుకుంటే మంచిదని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇప్పటికైన సరే ఆయా రాజకీయ పార్టీలు ముందు పార్టీ బలోపేతానికి కారణమైన నేతలను.. కార్యకర్తలను ఆదుకుంటే ఆ పార్టీకి మనుగడ అని అంటున్నారు.