తెలంగాణ రైతాంగానికి శుభవార్త
తెలంగాణలోని రైతులకు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో శుభవార్తను తెలిపింది. ఈరోజు ఆదివారం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుభరోసా పై కీలక ప్రకటన చేశారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ ” త్వరలోనే రైతుభరోసా పథకాన్ని అమలు చేస్తాము.. సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో ఆ పథకం డబ్బులు జమ అవుతాయని తెలిపారు.
రైతుభరోసా విధివిధానాల గురించి రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని ప్రకటించారు. బీఆర్ఎస్ నేతలు చేసే తప్పుడు ప్రచారాన్ని రైతులు నమ్మోద్దు అని కోరారు.