సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్కిల్ డెవల్ ప్మెంట్ యూనివర్సిటీ కోసం ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ అదానీ ప్రకటించిన వందకోట్ల రూపాయల విరాళాన్ని వెనక్కి తిరిగి ఇవ్వనున్నట్లు మీడియా సమావేశంలో ప్రకటించారు.
ఇందుకు సంబంధించిన నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయద్దు అంటూ అదానీ కంపెనీకి ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ లేఖ కూడా రాసినట్లు తెలిపారు. ఇప్పటికే అదానీపై అమెరికాలో కేసులు నమోదైన సంగతి తెల్సిందే.