వేములవాడ సాక్షిగా కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్..?
వేముల వాడ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాల్ విసిరారు. వేముల వాడలో జరిగిన ప్రజావిజయోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ ” పదేండ్ల పాలనలో ఏనాడూ కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రాలేదు. కేవలం ఎన్నికల సమయంలోనే జనాలకు దర్శనమిస్తాడు. వందకోట్లతో వేముల వాడ ఆలయాన్ని అభివృద్ధి చేయడం చేతకాలేదు.
పదేండ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఉంటే ప్రగతి భవన్ లో.. ఫామ్ హౌజ్ లో ఉంటాడు. పదేండ్లలో ఎంతమంది రైతులకు రుణమాఫీ చేశారు. పదేండ్లలో ఎంతమంది యువతకు ఉద్యోగాలు ఇచ్చారు. పదేండ్లలో ఎన్ని ఎకరాలకు సాగునీళ్లు ఇచ్చారు. మేము వచ్చిన పది నెలల్లో యాబై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాము. కోటి అరవై లక్షల ఎకరాల్లో సాగైంది.
మేము మాట ఇచ్చిన ప్రకారం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను రుణమాఫీ చేశాము. దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకి రా. రుణమాఫీ పై చర్చిద్దాము. పదేండ్లలో జరిగిన సంక్షేమాభివృద్ధి.. పది నెలల్లో జరిగిన సంక్షేమాభివృద్ధిపై చర్చకు పెడదాము. మీకు నిజాలు మాట్లాడితే తట్టుకోలేరు. దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు.