రేవంత్ రెడ్డికి రక్షణగా బీజేపీ..?

Revanth’s sensational comments on Congress leaders
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి రక్షణగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ దళం మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్… మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. లగచర్ల ఘటన డైవర్శన్ కోసమే ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు.. ఎంపీలు మూసీ నిద్ర అనే డ్రామాలకు తెర తీశారు.
హైడ్రాను మొదట స్వాగతించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పుడు మూసీ బాధితుల తరపున మాట్లాడటం విడ్డూరం. ఇప్పుడు ఆయనకు మూసీ బాధితుల ఆక్రందనలు ,ఆవేదన గుర్తుకు వచ్చాయా అని మాజీ మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ అకౌంటులో పోస్టు చేశారు.
మూసీ బాధితులు నడిరోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేశారు.. తెలంగాణ భవన్ కు వచ్చి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. గాంధీభవన్ ముట్టడికి వెళ్లారు. అప్పుడు గుర్తుకు రాని ఇప్పుడు గుర్తుకు రావడం వెనక ఉన్న మతలబు ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ పాలిట్రిక్స్ ను తెలంగాణ గమ్నిస్తోందని ఆయన రాసుకోచ్చారు.