సన్నబియ్యం పంపిణీపై మంత్రి తుమ్మల క్లారిటీ..!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులందరికీ సంక్రాంతి పండుగ నుండి సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ ” సన్నాలకు ఐదోందల రూపాయలు బోనస్ ప్రకటించడంతోనే సన్నాల సాగు ఎక్కువయింది.
గతేడాది ఇరవై ఐదు లక్షల ఎకరాల్లో సాగు అయింది. ఈ సారి నలబై లక్షల ఎకరాల్లో సాగైంది. సంక్షేమ హాస్టల్లో కూడా సన్నబియ్యంతోనే అన్నం పెడతాము. మాది రైతుపక్షపాతి ప్రభుత్వం.. దేశంలో ఎక్కడ లేని విధంగా ఇరవై రెండు లక్షల మంది రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం మాది.
ఇందుకు పద్దేనిమిది వేల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. సబ్ కమిటీ నివేదిక తర్వాత రైతుభరోసా డబ్బులు ఇస్తాము. రైతుల ముసుగులో బీఆర్ఎస్ బీజేపీలు కుట్రలు చేస్తున్నాయి. ప్రతిపక్షాల మాయలో పడి రైతులు ఆగం కావోద్దు. పండించిన ప్రతి గింజను కొంటాము అని మంత్రి తుమ్మల అన్నారు.