రేవంత్ రెడ్డిపై చట్టపర చర్యలు తీసుకోవాలి

Thatha Madhu
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి & బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ అతనిపై తక్షణమే కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ నందు పిర్యాదు చేసిన ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎంఎల్ఏ కొండబాల కోటేశ్వరరావు మరియు జిల్లా ముఖ్య నాయకులు.అనంతరం మీడియా మిత్రులతో మాట్లాడుతూ: బిఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ అభివృద్ధి ప్రదాత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారిపై చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం చేతకాక ప్రజల ఆలోచనలను ఏం మార్చడం కోసం అనైతిక వ్యాఖ్యలతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలం వెళ్లదీస్తుంది.రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుంటూ, క్షమాపణలు చెప్పకపోతే తగిన గుణపాఠం చెప్పక తప్పదు.ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు అమలు చేసి వారి చిత్తశుద్ధి ని నిరూపించుకోవాలని హితవు పలికారు.అధికారం ఉంది కదా అని విర్రవీగుతున్న రేవంత్ రెడ్డి తీరును మార్చుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.బిజెపికి రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధం ఏమిటో రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తెలిపిన శుభాకాంక్షలు తోనే తేలిపోయిందని , రేవంత్ రెడ్డికి కనీసం కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ పెద్దలు ఏ ఒక్కరు శుభాకాంక్షలు తెలుపుకపోవడం ఆ పార్టీలో రేవంత్ రెడ్డికి ఉన్న గౌరవాన్ని తెలిపాయి..
ఇకనైనా తీరును మార్చుకొని ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు ప్రారంభించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, బి.ఆర్.ఎస్ పార్టీ మండల ఆధ్యక్షులు బెల్లం వేణు, ఉన్నం బ్రహ్మయ్య, మాజీ ఎంపీపీ సామినేని హరిప్రసాద్, కార్పొరేటర్ శీలంశెట్టి వీరభద్రం, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు మాదంశెట్టి హరిప్రసాద్, నున్నా శ్రీనివాసరావు,బంక మల్లయ్య, ముత్యాల వెంకటప్పారావు, పగడాల నరేందర్, డేరంగుల బ్రహ్మం, కోటి అనంత రాములు, సద్దాం షేక్, బొడ్డు గ్లోరీ, మద్దెల విజయ్, సతీష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.