కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మూసీ నది ప్రక్షాళనకు అడ్డు పడితే కుక్క చావు చస్తావ్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మూసీ ప్రక్షాళన పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” నీ బిడ్డ మూడు నెలలు జైలు వెళ్తేనే నీకు దుఃఖం వచ్చింది.
మా బిడ్డల కాళ్లు వంకర పోతే.. నడుము వంకర పోతే వాళ్లను ఇంట్లో కట్టేసి తల్లులు పనులకెళ్ళేవారు. వాళ్ల దుఃఖం నీకు పట్టలేదా..?. మూసీ నది ప్రక్షాళనకు అడ్డుపడితే ఆ పాపం తగిలి కుక్క చావు చస్తావ్ .. దిక్కు లేని చావు చస్తావ్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.