Cancel Preloader

గవర్నర్ తో రేవంత్ రెడ్డి భేటీ…?

 గవర్నర్ తో రేవంత్ రెడ్డి భేటీ…?

తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన సామాజిక, ఆర్ధిక, ఉపాధి, రాజకీయ, కుల సర్వే తీరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకి వివరించారు. ఈ సర్వే ప్రక్రియకు సంబంధించిన అన్ని అంశాలను తెలియజేశారు.

2025 లో దేశ వ్యాప్తంగా చేపట్టబోయే జనగణనలో తెలంగాణ తరహాలో కుల గణనను పరిగణలోకి తీసుకునే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా సీఎం గవర్నర్ ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన దేశానికి రోల్ మోడల్‌గా నిలుస్తుందని సీఎం చెప్పారు.

గవర్నర్ ని కలసిన వారిలో  మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి , ఎంపీలు పోరిక బలరాం నాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డి , సలహాదారులు వేం నరేందర్ రెడ్డి , షబ్బీర్ అలీ, డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ఉన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *