మేం ఆడవాళ్లం కాదా అంటున్న రోజా..?

Roja’s entry into movies again…!
7 total views , 1 views today
వైసీపీ మహిళ నాయకురాలు.. మాజీ మంత్రి ఆర్కే రోజా డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. మీడియాతో రోజా మాట్లాడుతూ ” సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వానికి చెందిన అభిమానులు.. కార్యకర్తలు నా కూతుర్ని ఎలా వేధిస్తున్నారో పవన్ కళ్యాణ్ చూడాలి.
రెండుసార్లు ఎమ్మెల్యెగా గెలిచాను.. ఒకసారి మంత్రిగా పని చేశాను.. నా మీద ఎన్ని రాశారు.. ఎన్ని మార్ఫింగ్ ఫోటోలు పెట్టారు .. ఆ రోజు పవన్ కళ్యాణ్ నోరు ఎందుకు మెదపలేదు. మేం ఆడవాళ్లం కాదా.?. మాకు ఫ్యామిలీలు లేవా..?. మా ఇంట్లో వాళ్లు ఫీలవ్వరా..?.
ఆయనకు మాత్రమే కూతుళ్ళున్నారా..?. నా పిల్లలు ఏమి తప్పు చేశారు.?. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక నా పై నా కుటుంబంపై ఇలాంటి రాతలు రాస్తున్నవారిని పవన్ కళ్యాణ్ సమర్ధిస్తున్నారా ..?. అని పవన్ ను మాజీ మంత్రి రోజా ప్రశ్నించారు.