మరోసారి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నిరసనగళం

Jeevan Reddy
4 total views , 1 views today
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి మరోకసారి గళమెత్తారు. ఆదివారం జగిత్యాలలో జరిగిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కార్యక్రమంలో ప్రభుత్వ విప్ లు అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్ లతో కల్సి ఆయన పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ ” పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు. కార్యకర్తలు ఎన్నో అవమానాలు.. కష్టాలను ఎదుర్కున్నారు.
ఇప్పుడు అదే పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరి అసలైన కాంగ్రెస్ క్యాడర్ కు రావాల్సిన పదవులు. రాజాభోగాలను లాక్కుంటామంటే ఎలా..?.పొరుగింటోడూ వచ్చి మన ముందు ఉన్న ఇస్తారును లాగేసుకుంటానంటే చూస్తా ఊరుకుంటమా..?. మన ప్రభుత్వంలో పదవులైన ఇంకా ఏమైన మన వాళ్లకే రావాలి అని వ్యాఖ్యానించారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ” పార్టీని నమ్ముకుని పని చేస్తున్న కార్యకర్తలకు,నేతలకు పదవులు దక్కాలి.వారి ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టాలి. అరవై శాతమున్న బీసీలకు పదవులు దక్కాలని ఆయన సూచించారు.ఈ నెల ఆరో తారీకు నుండి మొదలు కానున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ను విజయవంతం చేయాలని కాంగ్రెస్ క్యాడర్ కు ఆయన పిలుపునిచ్చారు.
