దొంగచాటుగా వెళ్లి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ డ్రగ్స్ టెస్ట్

 దొంగచాటుగా వెళ్లి  తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ డ్రగ్స్ టెస్ట్

Telangana Congress

6 total views , 1 views today

తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన యువనాయకుడు.. రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ దొంగచాటుగా వెళ్లి డ్రగ్స్ టెస్ట్ చేయించుకున్నారు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన హుజూర్ బాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ విసిరిన డ్రగ్స్ టెస్ట్ ఛాలెంజ్ పై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ విసిరిన సవాల్ ను నేను స్వీకరిస్తున్నాను.

మేము టైం డేట్ చెప్పకుండానే.. మాకు చెప్పకుండానే.. మీడియాకు సమాచారం ఇవ్వకుండా ఏఐజీ ఆసుపత్రికి దొంగచాటుగా వెళ్లి అనిల్ కుమార్ యాదవ్ ఎందుకు డ్రగ్స్ టెస్ట్ చేయించుకున్నారు. ఓ రెండు వీడియోలు తీసుకోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాలేదని ఎందుకు అంటున్నారు. టెస్ట్ కు ఎవర్ని పిలిచారు మీరు. మీరు ఎవరికి చెప్పారని ఆ వీడియోలో కౌంటరిచ్చారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

What do you like about this page?

0 / 400