బాబు హత్యకు కుట్ర…?
Chandrababu andhrapradesh CM
![]()
ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐదేండ్ల వైసీపీ పాలనలో నాతో సహా టీడీపీ శ్రేణులంతా తీవ్ర వేధింపులకు గురయ్యారు. అందరికంటే తానే ఎక్కువగా వేధింపులకు బలయ్యాను అని ఆయన అన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ నన్ను అక్రమ కేసులతో అరెస్టు చేసి జైల్లో ఉంచారు. ఆ సమయంలో నన్ను చంపాలనే కుట్రలు చేశారని ప్రచారం జరిగిందని అన్నారు. నమ్మి ఓట్లేసిన ప్రజలను వంచించారు. ప్రజల తరపున కొట్లాడుతున్న మమ్మల్ని అక్రమ కేసులతో వేధించారు ..
నేను ఉన్న జైలు పై డ్రోన్లు ఎగురవేశారు. సీసీ కెమెరాలు పెట్టారు. దోమ తెర కూడా లేకుండా చేశారు. కక్ష తీర్చుకోవడం నా లక్ష్యం కాదు. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచరాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తాను. మరి మితీ మీరితే ఏమి చేయాలో నాకు తెల్సు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.