నిరుద్యోగ యువతకు రేవంత్ రెడ్డి శుభవార్త

 నిరుద్యోగ యువతకు రేవంత్ రెడ్డి శుభవార్త

Revanth Reddy Telangana CM

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. బీఎఫ్ఎస్ఐ కోర్సు ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నారు.

ఉద్యోగాల భర్తీని బాధ్యతగా ఆచరణలో పెడుతున్నాము. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ముప్పై ఐదు వేల సర్కారు కొలువులిచ్చాము. రానున్న రెండు మూడు నెలల్లో మరో ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తాము.. వాటికి సంబంధించిన నోటిఫికేషన్లు సిద్ధమవుతున్నాయి.

ఇప్పటికే నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలను నిర్వహించిన వాటికి త్వరలోనే భర్తీ చేస్తాము.. ప్రైవేట్ సెక్టార్ లో పెట్టుబడులను ఆకర్శించి మరిన్ని కంపెనీలను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు తీసుకోస్తాము.. ప్రైవేట్ రంగంలో సైతం ఉపాధి అవకాశాలను కల్పిస్తాము అని ఆయన అన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *